Punjab National Bank: బంగారు అభరణాల రుణాలపై రేట్లు తగ్గించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్..!

Punjab National Bank: పండగ సీజన్‌లో కస్టమర్లకు బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను సైతం తగ్గిస్తోంది..

Punjab National Bank: బంగారు అభరణాల రుణాలపై రేట్లు తగ్గించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్..!
Follow us

|

Updated on: Oct 14, 2021 | 8:00 AM

Punjab National Bank: పండగ సీజన్‌లో కస్టమర్లకు బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను సైతం తగ్గిస్తోంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా ప్రాసెసింగ్‌ ఫీజులను తగ్గిస్తున్నాయి బ్యాంకులు. పండగ సీజన్‌లో వినియోగదారులకు మరింత ఆనందాన్ని అందించేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్‌ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందిస్తోంది. బంగారు అభరణాలపై 7.30 శాతం వడ్డీ రేటు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌పై 7.2 శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తోంది.

గృహ రుణాలపై తగ్గించిన వడ్డీ రేటు..

అంతేకాకుండా బంగారు రుణాలపైనే కాకుండా గృహ రుణాలపై కూడా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది. వీటిపై 6.60 శాతం నుంచి వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కారు లోన్‌పై 7.15 శాతం, వ్యక్తిగత రుణాలపై 8.95 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

సర్వీస్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు..

ఇటీవల గృహ రుణాలు, వాహనాల రుణాలపై ప్రకటించిన విధంగానే పండగ సీజన్‌లో బంగారు, పావరిన్‌ గోల్డ్‌ బాండ్‌పై సర్వీస్‌ ఛార్జీలను సైతం తగ్గించింది. ప్రాసెసింగ్‌ ఫీజులో రాయితీ కల్పిస్తోంది. అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ, యాక్సిస్‌, చిన్న ఫైనాన్స్‌ కంపెనీలు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌, ఇతర లోన్స్‌పై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులను కూడా తగ్గించాయి. వినియోగదారులు పండగ సీజన్‌లో కారు కొనుగోలు చేయాలన్నా, గృహ రుణాలు తీసుకోవాలన్నా ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

Credit Cards: పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా షాపింగ్‌ చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు

Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో