రోడ్డెక్కిన నగరవాసులు.. ఒమెగా ఆస్పత్రి వద్ద ఆందోళన
హైదరాబాద్ నగరవాసులు రోడ్డెక్కారు. బంజారాహిల్స్‌లో రోడ్ నెంబర్ 12లో ఉన్న ఒమెగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నుంచి వ్యర్థపదార్థాలు వెలువడుతున్నాయంటూ.. కాలనీవాసులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నుంచి వెలువడుతున్న బయో మెడికల్ వేస్టేజీ వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామంటూ రాస్తారోకో చేశారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కాలనీ వాసులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.