AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య సతీమణి సంతకం ఫోర్జరీ.. క్రిమినల్ కేసు..!

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. ఆ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఈ నెల 13న వసుంధర ప్రతినిధికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని […]

Balakrishna: బాలయ్య సతీమణి సంతకం ఫోర్జరీ.. క్రిమినల్ కేసు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 11:08 AM

Share

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. ఆ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఈ నెల 13న వసుంధర ప్రతినిధికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన వారు, అకౌంట్‌ నంబర్‌ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు. అయితే తాము ఏ మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని వసుంధర ప్రతినిధి తెలిపారు. తరువాత ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. తాను ఎలాంటి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని వసుంధర స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు అధికారులు ఆరా తీయగా.. కొత్తగా వచ్చిన ఓ అకౌంటెంట్ ఈ చర్యకు పాల్పడ్డట్లు తేలింది. దీనిపై అతడిని నిలదీయగా మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో వసుంధర ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ అకౌంటెంట్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!