అజీమ్ ప్రేమ్‍జీ దాతృత్వం: రూ.52 వేల కోట్ల విరాళం

చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ దాతృత్వంలో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. విప్రో సంస్థలోని తన వాటా షేర్లలో మరో 34 శాతాన్ని దాతృత్వానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ. 52 వేల కోట్ల పైమాటే. ఇప్పటికే భారీగా తన ఆస్తులను విరాళం ఇస్తానని ప్రేమ్ జీ ప్రకటించారు. మొత్తం రూ.1.45 లక్షల కోట్లను ఆయన విరాళంగా ఇస్తుండటం గమనార్హం. ఈ మొత్తాన్ని ఆయన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్‌కు […]

అజీమ్ ప్రేమ్‍జీ దాతృత్వం: రూ.52 వేల కోట్ల విరాళం
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 2:45 PM

చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ దాతృత్వంలో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. విప్రో సంస్థలోని తన వాటా షేర్లలో మరో 34 శాతాన్ని దాతృత్వానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ. 52 వేల కోట్ల పైమాటే. ఇప్పటికే భారీగా తన ఆస్తులను విరాళం ఇస్తానని ప్రేమ్ జీ ప్రకటించారు. మొత్తం రూ.1.45 లక్షల కోట్లను ఆయన విరాళంగా ఇస్తుండటం గమనార్హం. ఈ మొత్తాన్ని ఆయన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నారు. విప్రోలో తన వాటా షేర్లలో 67 శాతాన్ని ఆయన దాతృత్వానికి కేటాయించడం విశేషం. విప్రోలో 74.30 శాతం వాటా ఉన్న అజీమ్ ప్రేమ్ జీ కుటుంబానికి రూ .1,55,523 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది.

పాఠశాల విద్యా వ్యవస్థలో అభివృద్ధికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాల‌ల్లో నాణ్యమైన విద్య అందించడడానికి, సమానత్వాన్ని పెంపొందించే దిశగా పాటుపడుతోంది. ఎన్జీవోలకు బాసటగా నిలిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరులో ఈ సంస్థకు యూనివర్సిటీ ఉంది.