భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటే.. మసూద్‌ ను అప్పగించండి : సుష్మా

న్యూఢిల్లీ : పాకిస్థాన్ తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో ఇమ్రాన్ ఖాన్ నిజంగా సత్సంబంధాలు కోరుకుంటే ముందుగా మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.మసూద్‌ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సుష్మా చురకలంటించారు. ఇమ్రాన్‌కు అంత పెద్ద మనుసుంటే… మసూద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. #WATCH EAM Sushma […]

భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటే.. మసూద్‌ ను అప్పగించండి : సుష్మా
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 2:05 PM

న్యూఢిల్లీ : పాకిస్థాన్ తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి మండిపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో ఇమ్రాన్ ఖాన్ నిజంగా సత్సంబంధాలు కోరుకుంటే ముందుగా మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.మసూద్‌ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సుష్మా చురకలంటించారు. ఇమ్రాన్‌కు అంత పెద్ద మనుసుంటే… మసూద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు ఇప్పటికే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ను చైనా మరోసారి అడ్డుపుల్ల వేసింది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. కాగా మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులుకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం చెబుతోంది.

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే