అయోధ్యకేసు జులై 31కి వాయిదా..!

సుప్రీంకోర్టుకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదికను సమర్పించింది. పూర్తి స్థాయి నివేదికను జూలై 31లోపు కోర్టుకి అందజేయలని కోరిన సుప్రీం. జులై 31 వరకు మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 2 నుంచి అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. దేశంలోని అత్యంత సున్నితమైన కేసు రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాలుగా తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. తాజాగా.. ఈ కేసు పరిష్కారానికి […]

అయోధ్యకేసు జులై 31కి వాయిదా..!
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 12:15 PM

సుప్రీంకోర్టుకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదికను సమర్పించింది. పూర్తి స్థాయి నివేదికను జూలై 31లోపు కోర్టుకి అందజేయలని కోరిన సుప్రీం. జులై 31 వరకు మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 2 నుంచి అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

దేశంలోని అత్యంత సున్నితమైన కేసు రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాలుగా తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. తాజాగా.. ఈ కేసు పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీని ఆరా తీసిన సుప్రీం.. కేసులో పెద్దగా పురోగతి లేదని భావించి.. పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టింది. 18వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించింది.