ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్ ఉత్పాదనలో ‘పొరబాట్లు’, అధ్యయన ఫలితాలపై కమ్ముకున్న నీలినీడలు
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనికా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సీన్ పై అప్పుడే అనుమానపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనికా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సీన్ పై అప్పుడే అనుమానపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టీకామందు ఉత్పాదనలో యేవో తప్పిదాలు జరిగాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అంగీకరించాయి. దీంతో ప్రాథమిక ఫలితాలపై సందేహాలు తలెత్తాయి. ఇది తీసుకున్న కొంతమంది స్టడీ పార్టిసిపెంట్ల (వలంటీర్ల) లో వేర్వేరు లక్షణాలు కనిపించాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. తక్కువ డోసు తీసుకున్నవారిలో ఎక్కువ డోసు (రెండు పూర్తి స్థాయి డోసులు) తీసుకున్నవారికన్నా మెరుగైన ప్రొటెక్షన్ ఉన్నట్టు తేలింది. ఉదాహరణకు తక్కువ స్థాయిలో తీసుకున్నవారిలో ఇది 90 శాతం ఎఫెక్టివ్ గా పని చేయగా, ఎక్కువ డోసులు తీసుకున్నవారిలో 62 శాతం మాత్రమే ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం మీద ఈ టీకామందు జస్ట్ 70 శాతమే సమర్థంగా పని చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆస్ట్రాజెనికా అంచనా వేస్తోంది. అయితే ఈ అధ్యయన ఫలితాలను నిపుణులు ఇంకా స్టడీ చేయాల్సి ఉంది.
ఏమైనా.. కరోనా వైరస్ ని సమర్థంగా కట్టడి చేసే వ్యాక్సీన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నవారికి ఇది కొంత నిరాశాజనక వార్తే !