అస్సాంలో భారీ వరదలు: 91 మంది మృతి.. 123 మూగజీవాలు బలి
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అస్సాం రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటి వరకు భారీ వర్షాల ధాటికి 91 మంది ప్రాణాలు కోల్పోగా, కజిరంగా నేషనల్ పార్క్‌లోని 123 జంతువులతో సహా వందలాది మూగజీవాలు చనిపోయాయని అధికారులు చెప్పారు.

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అస్సాం రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటి వరకు భారీ వర్షాల ధాటికి 91 మంది ప్రాణాలు కోల్పోగా, కజిరంగా నేషనల్ పార్క్‌లోని 123 జంతువులతో సహా వందలాది మూగజీవాలు చనిపోయాయని అధికారులు చెప్పారు.
గత కొద్ది రోజులుగా అస్సాంలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతుంది. ఇప్పటికే ప్రమాదస్థాయికి అంచుకు చేరి ప్రవహిస్తోంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 49.68 మీటర్లకు చేరుకుందని, దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు చెప్పారు. రాష్రవ్యాప్తంగా దిబ్రూఘర్, నియమాటిఘాట్, తేజ్‌పూర్, గోల్‌పరా నదులు డేంజర్ లెవెల్‌లో ఉన్నాయన్నారు. దాదాపు 2,548 గ్రామాలు జలమయమయ్యాయి. ఇక ఇప్పటి వరకు దాదాపు 27లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. ధన్సరీ నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని అన్నారు. దాదాపు 1.46 లక్షల హెక్టార్ల పంట నీట మునిగగా, వందలాది మూగ జీవులు గల్లంతయ్యాయి. అటు, కజిరంగా నేషనల్ పార్క్ లోకి వరద నీటి వచ్చి చేరడంతో 123 జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. 12 రైనోలు, 93 జింకలు, నాలుగు అడవి బర్రెలు చనిపోయాయన్నారు. మరిన్ని జంతువులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
More than 100 wild animals, including at least eight rare one horned rhinos, have died in recent flooding at Kaziranga National park in Assam also the floods have killed more than 200 people and displaced millions there.@CampaignYolo #NorthEastMatters #AssamFloods pic.twitter.com/oA9H0Nd5h2
— Lakshmi gupta (@Lakshmigupta18) July 23, 2020




