AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి కేసు కీలకమలుపులు తిరుగుతోంది. 2018 నాటి ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారనీ ఆర్నాబ్ ఇవాళ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనపై మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు బుధవారం తెల్లవారుజామున అర్నాబ్‌ను అరెస్ట్ చేసిన విషయం […]

హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి
Venkata Narayana
|

Updated on: Nov 05, 2020 | 1:18 PM

Share

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి కేసు కీలకమలుపులు తిరుగుతోంది. 2018 నాటి ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారనీ ఆర్నాబ్ ఇవాళ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనపై మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు బుధవారం తెల్లవారుజామున అర్నాబ్‌ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ముంబైలోని లోవర్ పారెల్‌లోని అర్నాబ్ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం ఆయనను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఈ నెల 18 వరకు అర్నాబ్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన అలీబాగ్ జైలు కోసం ఏర్పాటు చేసిన ఓ కొవిడ్ కేంద్రంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే తనమీద విచారణపై స్టే విధించి, తనను విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన ముంబై హైకోర్టుకు విన్నవించారు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కూడా ధర్మాసనాన్ని కోరారు. అరెస్టు సందర్భంగా పోలీసులు తన ఇంట్లోకి చొరబడి వేధింపులకు పాల్పడ్డారని కూడా సదరు పిటిషన్‌లో ఆర్నాబ్ ఆరోపించారు. కాగా, ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!