AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. బదులుగా ఏం చేయాలంటే

పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారా? ఆందోళన చెందకుండా వారి ఎదుగుదలలో సహజ మార్పులను అర్థం చేసుకుని, నిపుణులు సూచించిన wఈ కింది పేరెంటింగ్ చిట్కాలు పాటించండి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి శరీరం, మనస్సులో సహజమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో వారు..

పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. బదులుగా ఏం చేయాలంటే
Bathroom Habits In Children
Srilakshmi C
|

Updated on: Jul 16, 2026 | 1:30 PM

Share

పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి శరీరం, మనస్సులో అనేక సహజ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల సమయంలో వారి ప్రవర్తనలో కూడా కొన్ని కొత్త అంశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పిల్లలు బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం గమనించినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భయపడటం, మందలించడం లేదా అనుమానించడం కంటే అర్థం చేసుకుని వ్యవహరించడం ఎంతో ముఖ్యమని మనోవైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల ఓ తల్లి తన 9 ఏళ్ల కుమారుడు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నాడని మనోవైద్యురాలు కోమల్ బక్షిని సంప్రదించారు. దీనిపై స్పందించిన ఆమె.. 8 నుంచి 9 ఏళ్ల వయస్సు నుంచే పిల్లల్లో తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవాలనే సహజమైన ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ వయస్సులో పిల్లలు తమ శరీరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని, దాన్ని చెడు అలవాటుగా చూడకూడదని సూచించారు.

శరీరం గురించి ఆసక్తి సహజమే

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర నిర్మాణం, పెరుగుదల, మార్పుల గురించి ఆసక్తి అబ్బాయిల్లోనే కాదు, అమ్మాయిల్లో కూడా సాధారణమే. పిల్లలు తమ శరీరాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో అనేక ప్రశ్నలు కలిగి ఉంటారు. ఈ సమయంలో వారిని తిట్టడం, భయపెట్టడం లేదా అవమానించడం వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి

ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ముందుగా పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడాలి. వారి వయస్సుకు తగిన భాషలో శరీరంలో మార్పులు రావడం సహజమని వివరించాలి. పిల్లలు ఎలాంటి సందేహాలైనా స్వేచ్ఛగా అడగగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. దీంతో వారు తప్పుడు సమాచారానికి దూరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన అవగాహనను పెంపొందించుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్నెట్ వినియోగంపై పర్యవేక్షణ అవసరం

పిల్లలు వయసుకు తగని లేదా అశ్లీల కంటెంట్‌కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్, ఇంటర్నెట్ వినియోగంపై సరైన పర్యవేక్షణ అవసరమే అయినప్పటికీ, అది పిల్లల గోప్యతకు భంగం కలగకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

శారీరక, సృజనాత్మక కార్యకలాపాలకు ప్రోత్సహించాలి

పిల్లలను ఆటలు, క్రీడలు, పుస్తక పఠనం, కళలు, ఇతర అభిరుచులు వంటి కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల వారి శారీరక, మానసిక వికాసం మెరుగుపడటమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

అవమానించడం కాదు.. అర్థం చేసుకోవడం ముఖ్యం

పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారని వారిని ప్రశ్నించడం, ఎగతాళి చేయడం, అవమానించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ప్రవర్తన పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరమయ్యే పరిస్థితికి దారితీయవచ్చు. బదులుగా, వారి భావాలను అర్థం చేసుకుని, నమ్మకంతో మాట్లాడితే వారు ఎదుగుదలలో భాగమైన ఈ దశను ఆరోగ్యకరంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరని మనోవైద్యులు సూచిస్తున్నారు.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!