AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అఖండ 2’ తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

‘అఖండ 2’ తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 10:26 PM

Share

‘అఖండ 2’ తర్వాత బోయపాటి శ్రీను నెక్ట్స్‌ మూవీపై ఆసక్తి నెలకొంది. బాలకృష్ణతో ‘అఖండ 3’ ఉంటుందని ఆయన చెప్పినా, బాలయ్య బిజీ లైనప్‌ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు గీతా ఆర్ట్స్‌ నుంచి బోయపాటికి ఆఫర్‌ ఉన్నట్లు, తమిళ హీరో సూర్యతో యాక్షన్‌ డ్రామాపై చర్చలు జరుగుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో బాలయ్య కోసం వేచి ఉంటారా? లేక మరో హీరోతో ముందుకెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

అఖండ 2 తర్వాత సైలెంట్ అయిపోయిన మాస్ డైరెక్టర్ బోయపాటి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? అఖండ 3 ఉంటుందని ఆయన చెప్తున్నారు.. కానీ అది అంత ఈజీనా..? ప్రస్తుతం బాలయ్య ఉన్న బిజీ లైనప్‌కు అసలు ఆ సినిమా సాధ్యమేనా..? ఒకవేళ అఖండ 3 వర్కవుట్ అవ్వకపోతే.. బోయపాటి ముందున్న ఆప్షన్స్ ఏంటి..? ఏ హీరో లైన్‌లో ఉన్నారు..? అఖండ 3 ఉంటుందని బోయపాటి కన్ఫర్మ్ చేసారు.. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన.. బాలయ్య సినిమా కన్ఫర్మ్ చేసారు.. కానీ ఉందని ఆయన చెబుతున్నా బాలయ్య మాత్రం చాలా బిజీగా ఉన్నారిప్పుడు. దాదా సెట్స్ మీద ఉండగా.. నెక్ఠ్స్ కొరటాల ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు.. ఆ తర్వాత విజయ్ కనకమేడలతో పాటు వశిష్ట తెరకెక్కిస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీలోనూ బాలయ్య ఒక కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తై అఖండ 3 మొదలవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది.. బోయపాటి అంత కాలం వేచి చూస్తారా అనేది అనుమానమే. బోయపాటికి గీతా ఆర్ట్స్ నుంచి ఆఫర్ ఉంది.. ఇప్పటికే ఒక పవర్ ఫుల్ మాస్ కథ సిద్ధం చేసి పెట్టారు.. అయితే ఈ హై వోల్టేజ్ స్టోరీ అల్లు అర్జున్ కోసమే రాశారా లేక వేరే హీరోతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. గీతా ఆర్ట్స్ ఆఫర్‌తో పాటు తమిళ హీరో సూర్యతో కూడా బోయపాటి ఒక యాక్షన్ డ్రామా చేయబోతున్నారనే చర్చలు ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. సూర్య బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఒక పక్కా ఊరమాస్ సబ్జెక్టును బోయపాటి ఎప్పుడో రాసిపెట్టారు. మరి ఈ అల్లు కాంపౌండ్, సూర్య ఆప్షన్లలో ఒకటి ఎంచుకుంటారా లేదంటే బాలయ్య కోసమే వేచి చూస్తారా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Follow Us