చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
తెలుగు సినిమా ప్రయోగాలకు సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 95 ఏళ్ల వయసులోనూ మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న ఆయన, తన 62వ చిత్రానికి ‘A Fruit Cuts the Knife’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. వీరిద్దరి వాట్సాప్ సంభాషణను నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే సింగీతం కన్నుమూయడంతో ఆయన చివరి సినిమా ఆలోచన అసంపూర్తిగా మిగిలిపోయింది.
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, కొత్త ఆలోచనలకు మారుపేరుగా నిలిచిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. వయసు పెరిగినా ఆయనలోని సినిమా పట్ల ఆసక్తి మాత్రం ఏనాడూ తగ్గలేదు. దర్శకుడిగా ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఆయన.. జీవిత చరమాంకంలోనూ మరో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నారంటే సినిమా అంటే ఆయనకున్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దర్శకుడిగా పనిచేయడానికి శారీరక శ్రమతో పాటు ఎంతో ఓపిక, ఏకాగ్రత అవసరం. అయితే వయసు తన క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి కాదని సింగీతం శ్రీనివాసరావు నిరూపించారు. దాదాపు 95 ఏళ్ల వయసులోనూ ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. సింగ్ గీతం తర్వాత కూడా సింగీతం శ్రీనివాసరావు సినిమాలకు పూర్తిగా దూరం కావాలని అనుకోలేదు. మరో చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా వెల్లడించారు. సింగీతం శ్రీనివాసరావుతో జరిగిన వాట్సాప్ సంభాషణను నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఆలోచనను సింగీతం ఆయనతో షేర్ చేసుకున్నట్లు తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు తన 62వ చిత్రానికి ‘A Fruit Cuts the Knife’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకున్నట్లు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయనతో మాట్లాడిన విషయాన్ని, సినిమా చేయాలనే ఉత్సాహాన్ని చివరి రోజుల్లోనూ సింగీతం వ్యక్తం చేసినట్లు నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. ఒక దర్శకుడు తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కూడా కొత్త కథలు, కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు కనడం అరుదైన విషయం. సింగీతం విషయంలో మాత్రం సినిమా అనేది కేవలం వృత్తి కాదు.. జీవితాంతం కొనసాగిన ఓ అభిరుచి. సింగీతం శ్రీనివాసరావు మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే ఆయన కన్నుమూయడం సినీ అభిమానులను కలచివేస్తోంది. ఆయన 62వ ప్రాజెక్ట్ కేవలం ఆలోచనగానే మిగిలిపోతుందా.? లేక ఎప్పుడైనా మరొక దర్శకుడు ఆ కథను, ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్తారా.? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ
భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?
దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి
శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

