AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్.. పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా తీపి పదార్థం అడిగినప్పుడు లేదా ఇంట్లో పండుగ వేళల్లో అప్పటికప్పుడు కొత్త రుచిని అందించాలనుకున్నప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం 'బియ్యం పిండి జ్యూసీ స్వీట్ బాల్స్. సాధారణంగా రసగుల్లాలు లేదా గులాబ్ జామూన్ చేయాలంటే పాలు విరగ్గొట్టడం లేదా పాలపొడి, ఖోవా వంటివి అవసరమవుతాయి. కానీ ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే సాధారణ బియ్యం పిండి, కొద్దిపాటి పంచదారతోనే అచ్చం స్వీట్ షాపుల్లో కొనే మిఠాయిల కంటే ఎంతో మృదువైన, రసభరితమైన స్వీట్‌ను నిమిషాల్లో చేసుకోవచ్చు.

Phani CH
|

Updated on: Oct 07, 2026 | 11:01 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు జల్లించిన బియ్యం పిండి, 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి ,  1 కప్పు పంచదార,  1½ కప్పుల నీళ్లు. తయారీ విధానం: ఒక కప్పు బియ్యం పిండిని ముందుగానే జల్లెడ పట్టి ఉంచుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి వేడెక్కాక బియ్యం పిండిని వేసి లో-మీడియం మంటపై లేత రంగు వచ్చే వరకు నిదానంగా వేయించాలి ఎక్కువగా రంగు మారకూడదు, పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వస్తే సరిపోతుంది. వేగిన పిండిని ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

1 / 5
చల్లారిన బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుని.. పిండి తీసుకున్న కప్పుతోనే సరిగ్గా రెండు కప్పుల నీళ్లు పోసి విస్కర్ లేదా చెంచాతో ఉండలు ఏమీ లేకుండా జారుడుగా కలపాలి. ఉండలు లేకుండా ఉండేందుకు ఈ పిండి నీళ్లను మందపాటి కడాయిలోకి స్ట్రైనర్ సహాయంతో వడకట్టి పోయాలి.

2 / 5
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల స్వీట్ బాల్స్ గుల్లగా వస్తాయి. కడాయిని స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై నిరంతరం గరిటెతో తిప్పుతూ దగ్గరపడే వరకు ఉడికించాలి. పిండి మెత్తగా ఉడికి పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

3 / 5
పిండి గోరువెచ్చగా చల్లారాక చేత్తో మెత్తగా ఒత్తుతూ చిన్న చిన్న సైజులో గుండ్రటి బాల్స్‌లా చుట్టుకుని ప్లేట్‌లో పెట్టుకోవాలి. పిండి ఎంత బాగా ఉడికితే బాల్స్ అంత సాఫ్ట్‌గా పగుళ్లు లేకుండా వస్తాయి. స్టవ్‌పై వేరొక కడాయి పెట్టి ఒక కప్పు పంచదార, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి వేడిచేయాలి. తీగపాకం లాంటివి ఏమీ రానవసరం లేదు; పంచదార పూర్తిగా కరిగితే చాలు. పంచదార కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు తయారుచేసి ఉంచుకున్న బియ్యం పిండి బాల్స్‌ను ఒక్కొక్కటిగా వేయాలి.

4 / 5
మీడియం మంటపై రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికిస్తే ఆ బాల్స్ పంచదార పాకాన్ని పూర్తిగా లోపలి వరకు పీల్చుకుంటాయి . ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. అంతే, నోరూరించే సరికొత్త 'బియ్యం పిండి జ్యూసీ స్వీట్ బాల్స్' సిద్ధం! ఒక్కసారి రుచి చూస్తే పిల్లలు స్వీట్ షాప్ వైపు కూడా చూడకుండా ప్లేట్లు ఖాళీ చేసేస్తారు!

5 / 5
Follow Us