సింగపూర్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశంలో జననాల రేటు తగ్గిపోతుండడంతో, దాన్ని పెంచేందుకు 21-35 ఏళ్ల మధ్య వయస్సున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫస్ట్ డేట్ అనే డేటింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా మ్యాచ్లను సిఫార్సు చేస్తుంది. ఫేక్ ప్రొఫైల్స్ నివారించడానికి సింగ్పాస్ డిజిటల్ ఐడీని ఉపయోగిస్తుంది.