AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి.. ప్రాణం.. కానీ నేను వెళ్లను.. జబర్దస్త్ నటి..

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ షో పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఎప్పటికప్పుడు మరింత రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే ఈషోలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది సెలబ్రెటీలు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఇప్పటికే అగ్నీ పరీక్ష కోసం అడిషన్స్ చేశారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది.

Bigg Boss 10 Telugu : నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి.. ప్రాణం.. కానీ నేను వెళ్లను.. జబర్దస్త్ నటి..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2026 | 1:41 PM

Share

బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అన్నిభాషలలోనూ ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే తెలుగులో 9 సీజన్స్ కంప్లీట్ కగా. ఇప్పుడు పదవ సీజన్ స్టార్ట్ కానుంది. ఇదివరకే ఈ షోపై ప్రోమోస్ రిలీజ్ చేశారు. అలాగే అగ్నీ పరీక్ష కోసం వీడియోస్ పంపాలంటూ సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరోవైపు కొందరు సీరియల్ నటీనటుల పేర్లు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి హౌస్ లోకి సామాన్యులతో పాటు సీరియల్ స్టార్స్ ఎక్కువగానే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ సైతం ఉండనున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా జబర్దస్త్ నటి బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ఆమె మరెవరోకాదు.. యోధ. యోధ సిస్టర్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బబర్దస్త్ రియాల్టీ షోలో అలరిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రితో కలిసి పాల్గొన్న యోధ మాట్లాడుతూ.. బిగ్ బాస్ రియాలిటీ షోపై తన అభిప్రాయాన్ని, కుటుంబ సభ్యుల ఆసక్తిని పంచుకున్నారు. తనకు బిగ్ బాస్ అంటే ప్రాణమని, పిచ్చి అని యోధ వెల్లడించారు. తన బిడ్డ ఎంతగానో బిగ్ బాస్ చూస్తుందని, తనను “బిగ్ బాస్ కి వెళ్ళండి డాడీ” అని పదే పదే కోరుతుంటుందని యోధ తండ్రి వివరించారు. చివరిసారి కెమెరా వాళ్ళతో రికమెండ్ చేసి, ఒక్కరోజు లేదా రెండు రోజులకైనా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి రావాలని తన కుమార్తె కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఈ ఇంటర్వ్యూలో యోధను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేద్దామని యాంకర్ ప్రశ్నించగా, యోధ స్పష్టంగా “నేనెళ్ళను” అని బదులిచ్చారు. దీప్తి సునయన వంటివారు చిన్న వయసులోనే బిగ్ బాస్ లోకి వెళ్లిన ప్రస్తావన తెచ్చినా, తన వైఖరిలో మార్పు లేదని చెప్పుకొచ్చింది “ఆఫ్టర్ టెన్త్ స్టాండర్డ్ తరువాత… ఆహా, లేదు లేదు. నేనస్సలు వెళ్ళను” అంటూ హాస్యభరితంగానే అయినా, బిగ్ బాస్ లోకి వెళ్లడానికి తనకు ఆసక్తి లేదని యోధ తేల్చి చెప్పారు. బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్నా, అందులోకి వెళ్లడానికి జబర్దస్త్ యోధ నిరాకరించింది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

జబర్దస్త్ యోధా..

Yoda

Yoda

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..