AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత జట్టులో ఆ ఇద్దరు చాలా డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే.. ఇంగ్లాండ్ కెప్టెన్

Harry Brook warning: మొత్తం మీద, స్వదేశంలో సిరీస్ రక్షించుకోవాలని ఇంగ్లాండ్, సిరీస్ సొంతం చేసుకుని సగర్వంగా నిలవాలని భారత్.. ఇలా రెండు అగ్రశ్రేణి జట్లు హోరాహోరీగా తలపడనున్న ఈ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించడం ఖాయం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో, హ్యారీ బ్రూక్ ప్రణాళికలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

భారత జట్టులో ఆ ఇద్దరు చాలా డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే.. ఇంగ్లాండ్ కెప్టెన్
Harry Brook Warning To Team India
Venkata Chari
|

Updated on: Jul 16, 2026 | 1:16 PM

Share

Harry Brook warning: వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టిన టీమిండియా, సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రెండో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. అయితే, సొంత గడ్డపై మొదటి మ్యాచ్ ఓటమితో రగిలిపోతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశాడు. భారత స్టార్ ఆటగాళ్లను అడ్డుకుంటే గెలుపు తమదేనంటూ సవాల్ విసిరాడు.

కార్డిఫ్‌లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం..

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డేకు ఈ రోజు కార్డిఫ్ మైదానం వేదిక కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, అదే విజయ పరంపరను కొనసాగించాలని తహతహలాడుతోంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన మెన్ ఇన్ బ్లూ, ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌కు అత్యంత కీలకం. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో వారు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ పోరు ఆతిథ్య జట్టుకు అచ్చంగా చావో రేవో లాంటిది.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

ఇవి కూడా చదవండి

బౌలర్ల దెబ్బకు కుదేలైన ఇంగ్లాండ్.. పక్కా వ్యూహంతో వస్తున్నాం..!

తొలి వన్డేలో భారత బౌలర్ల కచ్చితమైన లెంగ్త్, పదునైన బంతుల దాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఏ దశలోనూ టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. దీంతో ఈ రెండో వన్డేలో బ్యాటర్ల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. తమ జట్టు ఘోర ఓటమికి ముమ్మాటికీ బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించాడు. అయితే, ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, లోపాలను సరిదిద్దుకుని సరికొత్త ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు.

ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లే మా ప్రధాన టార్గెట్: హ్యారీ బ్రూక్

టీమిండియాను ఓడించడానికి తాము ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని బ్రూక్ వెల్లడించాడు. ముఖ్యంగా భారత బౌలింగ్ దళపతి జస్ప్రీత్ బుమ్రాను, అలాగే బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కట్టడి చేస్తే.. మ్యాచ్ తమ చేతుల్లోకి వస్తుందని అతను విశ్లేషించాడు. “అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లతో నిండిన బలమైన భారత జట్టును ఎదుర్కోవడం నిజంగా ఒక కఠినమైన సవాలే. కానీ మా వ్యూహాలపై, మా సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గత మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుని, సిరీస్‌ను సమం చేసేందుకే బరిలోకి దిగుతున్నాం” అని బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

అప్రమత్తంగా ఉండాల్సిన టీమిండియా

హ్యారీ బ్రూక్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లపై ఇంగ్లాండ్ బౌలర్లు, బ్యాటర్లు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. భారత జట్టు కూడా ఎలాంటి అతివిశ్వాసానికి పోకుండా, వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ జట్టు తమ పూర్తి బలగాన్ని ఉపయోగించి చావో రేవో తేల్చుకునేందుకు తీవ్ర స్థాయిలొ ఎదురుదాడికి దిగే అవకాశం ఉన్నందున, టీమిండియా ఆటగాళ్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..