AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: పవర్ ప్లాంట్‌లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లోకి కూడా.. ఎవరంటే?

జబర్దస్త్ కమెడియన్లు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం కొత్తమీ కాదు. గతంలో ముక్కు అవినాష్, ఫైమా లాంటి ఆర్టిస్టులు ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. అయితే ఈసారి జబర్దస్త్ నుంచి చాలా మంది బిగ్ బాస్ షోలోకి వెళుతున్నారని తెలుస్తోంది.

Jabardasth: పవర్ ప్లాంట్‌లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లోకి కూడా.. ఎవరంటే?
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 1:15 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే పదో సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సారి బిగ్ బాస్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే బిగ్ బాస్ హౌస్ రూల్స్ కూడా మారనున్నాయి. కంటెస్టెంట్ల ఎంపికలోనూ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల నిర్వహణలోనూ చాలా మార్పులు వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షోలోకి ఎవరెవరు వస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో లాగే ఈ సారి కూడా బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు బిగ్ బాస్ లో సందడి చేయనున్నారు. అయితే ఈసారి జబర్దస్త్ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వర్ష, పవిత్ర, వర్షిణీ, బుల్లెట్ భాస్కర్, మహిధర్ తదితర కమెడియన్లు ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక జబర్దస్త్ కమెడియన్ పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. అతను మరెవరో కాదు నూకరాజు.

ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తున్నాడు నూకరాజు. అలాగే తన కో- ఆర్టిస్ట్ ఆసియాతో కలిసి ఫోక్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడీ స్టార్ కమెడియన్. ఇక సోషల్ మీడియాలోనూ నూకరాజుకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అతనిని బిగ్ బాస్ షో కు తీసుకు వస్తే  మంచి టీఆర్పీ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అతనిని సంప్రదించిందని సమాచారం. నూకరాజు కూడా బిగ్ బాస్ కు వచ్చేందుకు సముఖంగా ఉన్నాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కో- ఆర్టిస్ట్ ఆసియాతో జబర్దస్త్ నూకరాజు..

కాగా విజయ వాడకు చెందిన నూకరాజు పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిపోయాడు. కాగా పటాస్ కు రాక ముందు విజయవాడ పవర్ ఫ్లాంట్‌లో పని చేశాడు నూకరాజు. అయితే నటనపై ఆసక్తితో ఆ జాబ్ ను వదిలేసి హైదరాబాద్ కు వచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..