భారత్ ప్రతీకారం.. అభినందన్‌ను పట్టుకున్న పాక్ సుబేదార్ హతం..

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు బాలాకోట్ ఘటన తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ చర్యలకు ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ దాడులు చేసింది. ఆ సమయంలో పాక్ యుద్ద విమానాలు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా.. భారత్ […]

భారత్ ప్రతీకారం.. అభినందన్‌ను పట్టుకున్న పాక్ సుబేదార్ హతం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 8:07 PM

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు బాలాకోట్ ఘటన తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ చర్యలకు ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ దాడులు చేసింది. ఆ సమయంలో పాక్ యుద్ద విమానాలు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా.. భారత్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ వాటిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. పాక్ కు చెందిన ఎఫ్ 16 యుద్ద విమానాన్ని అభినందన్ కూల్చేశాడు. ఆ క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కాడు. ఆ సందర్భంలో పాకిస్తాన్ జవాన్ సుభేదార్ అహ్మద్ ఖాన్ అతన్ని పట్టుకుని తమ సైనికులకు అప్పగించాడు. కాగా, తాజాగా రెండు రోజుల క్రితం కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లోని పాకిస్తాన్ ఉగ్రవాదులకు, భారత జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో.. పాకిస్తాన్ జవాన్ సుభేదార్ అహ్మద్ ఖాన్ చనిపోయాడు. అయితే ఈ కాల్పుల్లో అతనితో పాటు ఇద్దరు భారత జవాన్లు కూడా మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.