గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు 8 ఏళ్ల జైలు
గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు వ్యాపారి బీ ఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. ఈ కేసులో ఛోటా రాజన్ తో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్థారించి 8ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వాంఖడే… 2012 అక్టోబర్ లో తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్న బీ ఆర్ శెట్టిపై ఛోటా రాజన్ గ్యాంగ్ […]
గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు వ్యాపారి బీ ఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. ఈ కేసులో ఛోటా రాజన్ తో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్థారించి 8ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వాంఖడే…
2012 అక్టోబర్ లో తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్న బీ ఆర్ శెట్టిపై ఛోటా రాజన్ గ్యాంగ్ కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..ఛోటా రాజన్ తో పాటు నిత్యానంద్ నాయక్, సెల్విన్ డేనియల్, రోహిత్ తంగప్పన్ జోసెఫ్ అలియాస్ సతీష్ కాలియా, దిలీప్ ఉపాధ్యాయ, తల్వీందర్ సింగ్ లకు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో ఇండోనేషియాలో అరెస్టైన ఛోటా రాజన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.