Ardhashathabdam Teaser: ‘యుద్ధమే ధర్మం కానప్పుడు.. ధర్మ యుద్ధాలు ఎక్కడివి’… ఆసక్తికరంగా ‘అర్థ శతాబ్ధం’ టీజర్..

Ardhashathabdam Teaser Out: ఇటీవల టాలీవుడ్‌లో సీరియస్ కథాంశాలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త దర్శకులు వెండి తెరకు ఎంట్రీ ఇస్తూ.. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక..

Ardhashathabdam Teaser: ‘యుద్ధమే ధర్మం కానప్పుడు.. ధర్మ యుద్ధాలు ఎక్కడివి’... ఆసక్తికరంగా ‘అర్థ శతాబ్ధం’ టీజర్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2021 | 4:23 PM

Ardhashathabdam Teaser Out: ఇటీవల టాలీవుడ్‌లో సీరియస్ కథాంశాలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త దర్శకులు వెండి తెరకు ఎంట్రీ ఇస్తూ.. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే వస్తుంది ‘అర్థ శతాబ్ధం’ అనే సినిమా. కేరాఫ్ కంచెరపాలెం చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అర్థ శతాబ్ధం’. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా సీరియస్ కథాంశంతో తెరకెక్కుతోంది. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. టీజర్‌లో వచ్చే ‘న్యాయం.. ధ‌ర్మం అవుతుంది కానీ ధ‌ర్మం.. ఎల్లప్పుడూ న్యాయం కాదు. యుద్ధమే ధ‌ర్మం కాన‌ప్పుడు ధ‌ర్మయుద్దాలెక్కడివి..ఈ స్వతంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం’ అని సాగే బ్యాక్ డ్రాప్ వాయిస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక టీజర్‌లో కనిపిస్తోన్న కొన్ని సన్నివేశాలు సినిమా కాంట్రవర్సీకి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేయడం విశేషం.

Also Read: గెస్ట్ రోల్ చేయాలంటే రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సిందే.. హీరోయిన్ డిమాండ్.. ఓకే చెప్పిన మేకర్స్..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..