Arattai: ‘అరట్టై’ నుంచి మరో కొత్త అప్‌డేట్.. యూజర్లకు ఇక పండుగే
దేశీయ సోషల్ మీడియా మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్ అరట్టై తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేందుకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, డెస్క్‌టాప్ అన్నీ వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Arattai App: స్వదేశీ టెక్నాలజీ సంస్థ జోహో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు పోటీగా అరట్టై పేరుతో వాట్సప్ తరహాలో కొత్త మెస్సేజింగ్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మేడిన్ ఇండియా యాప్ అయిన దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది. స్వదేశీ సోషల్ మీడియా యాప్స్‌ను ఉపయోగించాలని కేంద్ర మంత్రులు కూడా సూచిస్తున్నారు. దీంతో అరట్టై యాప్‌ను లక్షల మంది దేశంలో వినియోగిస్తున్నారు. ఒక సమయంలో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ ర్యాకింగ్స్‌లో ప్రధమ స్థానానికి కూడా చేరుకుంది.
యూజర్లకు కొత్త అనుభూతి అందించేందుకు అరట్టై యాప్ అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. అదే ఎండ్ టూ ఎండ్ ఎన్‌స్క్రిప్షన్. ఇది ఒక సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఫీచర్. మన సమాచారం, మెస్సేజ్‌లు భద్రంగా ఉండేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎవరితో అయినా వ్యక్తిగతంగా ఛాటింగ్ చేస్తునప్పుడు మెస్సేజ్ పంపిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి మధ్య మాత్రమే సమాచారం ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తమ కంపెనీ కూడా యాక్సెస్ చేయలేదని అరట్టై వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ వెర్షన్లలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్క్రిప్షన్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఫీచర్ కోసం యూజర్లు లేటెస్ట్ యాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో v1.33.6, ఐఫోన్లలో v1.17.23, డెస్క్‌టాప్‌లో v1.0.7 వెర్షన్లను అప్‌డేట్ చేసుకోవాలని తన ఎక్స్ ఖాతాల్లో అరట్టై కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




