AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: చంద్రయాన్ 4 ప్రయోగం డేట్ ఫిక్స్.. ఈ సారి ఇస్రో టార్గెట్ మామూలుగా లేదుగా..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఘనత అంటే చంద్రయాన్ ప్రయోగానికి ముందు చంద్రయాన్ ప్రయోగం తర్వాత అని చెప్పాలి. ప్రపంచ దేశాల దృష్టి భారత్ పై పడేలా చేసిన ప్రయోగం చంద్రయాన్...

ISRO: చంద్రయాన్ 4 ప్రయోగం డేట్ ఫిక్స్.. ఈ సారి ఇస్రో టార్గెట్ మామూలుగా లేదుగా..
Isro
Ch Murali
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 19, 2025 | 1:25 PM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఘనత అంటే చంద్రయాన్ ప్రయోగానికి ముందు చంద్రయాన్ ప్రయోగం తర్వాత అని చెప్పాలి. ప్రపంచ దేశాల దృష్టి భారత్ పై పడేలా చేసిన ప్రయోగం చంద్రయాన్. చంద్రయాన్ వన్ చంద్రయాన్ 2 చంద్రయాన్ 3 ప్రయోగాలతో సత్తా చాటిన ఇస్రో ప్రస్తుతం గగన్ యాన్, అంతరిక్షంలో భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక చంద్రయాన్ సిరీస్ లో నాలుగో ప్రయోగం చేపడతామని గతంలో ప్రకటించిన ఇస్రో ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇస్రో జపాన్ సంయుక్తంగా కలిసి లుపెక్స్(Lupex )అనే ప్రాజెక్ట్ ద్వారా 2028లో చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఇప్పటివరకు చంద్రయాన్ పేరుతో చంద్రుడిపై జరిగిన మూడు ప్రయోగాల్లో చంద్రుడి ఉపరితలం మీద మాత్రమే ప్రయోగాలు జరిగాయి. అయితే ఈసారి ప్రయోగం మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుందని ఇస్రో తెలిపింది.

చంద్రునిపై నమూనాలను సేకరించి తిరిగి భూమి మీదకు వచ్చే ప్రయోగ మిషన్ ఏర్పాట్లను ఇస్రో అతి త్వరలోనే చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు మరో మైలురాయి కాబోతోంది. కీలకమైన చంద్ర యాన్ మిషన్ పై ఇస్రో దృష్టి పెడుతోంది. ఈ చంద్రయాన్-4, ద్వారా చంద్రుని ఉపరితలంపై నమూనాలను సేకరించి భూమి మీద కు తెచ్చి తిరిగి పంపే మిషన్, 2028 లో ప్రారంభించనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ తెలిపారు. ఈ మిషన్ కు బారత ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని అంతేకాకుండా ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన అత్యంత సంక్లిష్టమైన కార్యక్రమాలలో ఈ చంద్రయాన్-4 ఒకటిగా దీనిని చెప్పుకొచ్చారు.

ఈ ప్రయోగం పనులు మొదలు పెడుతున్న కారణంగా ఇస్రో ఇప్పటికే ప్రారంభించిన కీలక ప్రాజెక్టులు ఏవి కూడా ఆలస్యం అయ్యే అవకాశం లేదని కూడా తెలిపారు. రాబోయే రోజుల్లో అవసరమైన డిమాండ్‌ మేరకు రాబోయే రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలని ఇస్రో యోచిస్తోందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. వాటిలో వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలు – PSLV – GSLV రాకెట్‌ల ప్రయోగాలు కూడా ఉంటాయన్నారు.

2028 లో భారత్ జపాన్ దేశాలు సంయుక్తంగా కలిసి నిర్వహించబోతున్న చంద్రయాన్ 4 ప్రయోగంలో చంద్రుని ఉపరితలంపైకి వ్యోమగాములను పంపే ప్రక్రియ ఇస్రోకు ఒక పెద్ద ముందడుగు.. భారతదేశం చంద్రునిపై పరిస్థితులను లోతుగా తెలుసుకోవడమే కాకుండా జపాన్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనుంది. భారతదేశం 2040 నాటికి వ్యోమగాములను చంద్రునిపై కి పంపీ సేఫ్ ల్యాండింగ్‌ను సాధించాలని లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. ఇస్రో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం అయిన భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్‌పై పనులు జరుగుతున్నాయి, దాని ఐదు మాడ్యూళ్లలో మొదటిది 2028 నాటికి ప్రారంభమవుతుంది. భారతదేశం తన సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్వహించే అతికొద్ది దేశాలలో ఒకటిగా మారుతుంది. చంద్రయాన్-4 షెడ్యూల్ ప్రకారం ప్రయోగిస్తే, అది మరో మైలురాయిగా మారనుంది.. ఇది సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో భారతదేశం పాత్ర మరింత అగ్రస్థానంలో నిలుపనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..