AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కుట్ర.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు సముచితం కాదు..

భారతదేశ ప్రజాస్వామ్యం బలమైనదని.. దాని పునాది సంస్థలపై పెరుగుతున్న విషపూరిత వాక్చాతుర్యంతో నిరంతరం దాడికి గురవుతోందని పలువురు న్యాయమూర్తులు, రిటైర్డ్ రాయబారులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల మాజీ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కొత్త కుట్ర అంటూనే.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు పెరగడం సముచితం కాదంటూ గుర్తుచేశారు.

భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కుట్ర.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు సముచితం కాదు..
Election Commission
Shaik Madar Saheb
|

Updated on: Nov 19, 2025 | 12:58 PM

Share

భారతదేశ ప్రజాస్వామ్యం బలమైనదని.. దాని పునాది సంస్థలపై పెరుగుతున్న విషపూరిత వాక్చాతుర్యంతో నిరంతరం దాడికి గురవుతోందని పలువురు న్యాయమూర్తులు, రిటైర్డ్ రాయబారులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల మాజీ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కొత్త కుట్ర అంటూనే.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు పెరగడం సముచితం కాదంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.. కొన్ని రాజకీయ నాయకులు ప్రజల కోసం విధాన పరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వడం బదులుగా, దేశపు ప్రాధాన్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు 16 మంది న్యాయమూర్తులు, 14 మంది రాయబారులు సహా 123 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 133 మంది రిటైర్డ్ సాయుధ దళాల అధికారులతో కూడిన 272 మంది ప్రముఖ పౌరులు బహిరంగ లేఖ విడుదల చేవారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను కళంకం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

‘‘గతంలో సాయుధ దళాలు, న్యాయవ్యవస్థ, పార్లమెంట్ తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఈ దుష్ప్రచారానికి గురవుతోంది. కొంతమంది రాజకీయ నాయకులు, నిజమైన విధాన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి బదులు, వారి నాటకీయ రాజకీయ వ్యూహంలో రెచ్చగొట్టేలా.. లేదా నిరాధార ఆరోపణలను ఆశ్రయిస్తున్నారు.  భారత సాయుధ దళాల శౌర్యం, విజయాలను ప్రశ్నించడం ద్వారా, న్యాయవ్యవస్థను, పార్లమెంటును, రాజ్యాంగబద్దంగా పనిచేసే వారిని ప్రశ్నించడం ద్వారా కళంకం చేయడానికి ప్రయత్నిస్తారు.. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ దాని సమగ్రత – ప్రతిష్టపై క్రమబద్ధమైన, కుట్రపూరిత దాడులను ఎదుర్కోవాల్సిన వంతు వచ్చింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల కమిషన్‌పై పదేపదే దాడి చేశారు.. ఎన్నికల కమిషన్ ఓటు దొంగతనానికి పాల్పడిందని తన వద్ద 100శాతం రుజువు ఉందని బహిరంగంగా ప్రకటించారు. అసభ్యకరమైన వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తూ.. ఈ కసరత్తులో పై నుంచి కింద వరకు ఎన్నికల కమిషన్‌లో ఎవరు పాల్గొన్నా, వారిని వదిలిపెట్టబోనని కూడా ఆయన బెదిరించారు. ఆయన ప్రకారం, ఈసీఐ రాజద్రోహానికి పాల్పడుతోంది. సీఈసీ/ఈసీలు పదవీ విరమణ చేస్తే, వారిని వెంటాడతానని ఆయన బెదిరించడం రికార్డు.. అయినప్పటికీ, ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఈసీ నిర్దేశించిన ప్రమాణ స్వీకార అఫిడవిట్‌తో పాటు ఎటువంటి అధికారిక ఫిర్యాదును దాఖలు చేయలేదు. అంతేకాకుండా, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్ వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం సమంజసం కాదు’’ వామపక్ష పార్టీలకు చెందిన సంఘాలు, సైద్ధాంతికంగా అభిప్రాయాలు కలిగిన వారు.. ఇతర రంగాలలోని కొంతమంది SIR పై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలతో చేరడం సమంజసం కాదు..  ఎన్నికల కమిషన్ “BJP – B-టీం” లాగా మారిపోయిందన్న ఆరోపణల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇటువంటి ఆవేశపూరిత ఆరోపణలు.. భావోద్వేగంగా శక్తివంతమైనవి కావచ్చు – కానీ అది లోతైన పరిశీలనలో నిలిచేవి కావు.. ఎందుకంటే ECI తన SIR పద్దతిని బహిరంగంగా పంచుకుంది.. కోర్టు మంజూరు చేసిన మార్గాల ద్వారా ధృవీకరణను పర్యవేక్షించింది.. అర్హత లేని పేర్లను తగిన విధంగా తొలగించింది. కొత్త అర్హత కలిగిన ఓటర్లను జోడించింది. అయినా.. ఇలాంటి ఆరోపణలు సంస్థాగత సంక్షోభం ముసుగులో రాజకీయ నిరాశను కప్పిపుచ్చే ప్రయత్నం అని ఇది సూచిస్తుంది.. అంటూ వారు వివరించారు.

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పుడు, ఎన్నికల కమిషన్ పై విమర్శలు ఉండవు.. ‘‘ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు అదే నాయకులు ఎన్నికల కమిషన్‌ను ప్రశంసిస్తారు, కానీ ఫలితాలు అనుకూలంగా రాకపోతే అదే సంస్థను తప్పుపడతారు. ఇది నిబద్ధత కాదు – అవకాశవాదం మాత్రమే.’’ అంటూ పేర్కొన్నారు.

దీనిపై కచ్చితత్వం ఉండాలి.. నకిలీ లేదా నకిలీ ఓటర్లు, పౌరులు కానివారు, భారతదేశం భవిష్యత్తులో చట్టబద్ధమైన స్థానం లేని వ్యక్తులకు ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో స్థానం ఉండకూడదు- ఎన్నికలను ప్రభావితం చేయడానికి వారిని అనుమతించడం ఒక దేశ సార్వభౌమాధికారం, స్థిరత్వానికి ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్యాలు ఇదే ఎదుర్కొంటున్నాయి.. అంటూ వివరించారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించిన తరంలో నాయకులు, కఠిన విభేదాల మధ్య కూడా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించారు. అలాంటి వారిలో టి.ఎన్. శేషన్, ఎన్. గోపాలస్వామి వంటి సీఈసీలు ఎన్నికల కమిషన్‌కు అఖండ నైతిక శక్తినిచ్చారు. వారు కఠిన నియమాలను అమలు చేసి, కమిషన్‌ను శక్తివంతమైన రాజ్యాంగ రక్షకుడిగా నిలబెట్టారన్నారు. ఈరోజు, పౌర సమాజం ఎన్నికల కమిషన్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నిరాధార ఆరోపణలతో ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడం కాకుండా, రాజకీయ పార్టీలు ప్రజలకు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలు, అభివృద్ధి ప్రణాళికలు, వాస్తవిక దృష్టి ఇవ్వాలి.

ప్రపంచంలోని అనేక దేశాల విదేశీ పౌరులు, అక్రమ ప్రవాసులు, లేదా అర్హత లేని వ్యక్తులు ఓటు వేసే పరిస్థితులను తీవ్రంగా ఎదుర్కొంటాయి. భారతదేశం కూడా తన ఓటర్ జాబితాలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని కాపాడటం అత్యంత అవసరం.

చివరగా- భారత ప్రజాస్వామ్యం బలమైనదే. మన సంస్థలు బలమైనవి.. కానీ వాటిపై నిరాధార దాడులు ఈ బలాన్ని దెబ్బతీయలేవు.. నాయకత్వం నిజాయితీ, విజన్, ప్రజాసేవతో కూడి ఉండాలి- రాజకీయ నాటకాలతో కాదు.. అంటూ న్యాయమూర్తులు, మాజీ అధికారులు బహిరంగ లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..