AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స‌ర్వీసుల పున‌రుద్ద‌ర‌ణ‌..తొలి రోజు ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం ఎంతంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో మొద‌టి రోజు ఆర్టీసీకి రూ.71 లక్షల ఆదాయం వచ్చింది. గురువారం మొత్తం 1,483 సర్వీసులు తిరగగా… ఆక్యుపెన్సీ రేట్‌ 40 శాతంగా న‌మోదైంది. కొవిడ్ కార‌ణంగా‌ ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆక్యుపెన్సీ రేట్ (ఓఆర్)‌ 64 శాతంగా ఉంది. శుక్రవారం రోజున‌ సర్వీసులను 1,316లకు కుదించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 169 స‌ర్వీసులు నడిపితే..కోవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్న‌ […]

స‌ర్వీసుల పున‌రుద్ద‌ర‌ణ‌..తొలి రోజు ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం ఎంతంటే..
Ram Naramaneni
|

Updated on: May 23, 2020 | 2:41 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో మొద‌టి రోజు ఆర్టీసీకి రూ.71 లక్షల ఆదాయం వచ్చింది. గురువారం మొత్తం 1,483 సర్వీసులు తిరగగా… ఆక్యుపెన్సీ రేట్‌ 40 శాతంగా న‌మోదైంది. కొవిడ్ కార‌ణంగా‌ ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆక్యుపెన్సీ రేట్ (ఓఆర్)‌ 64 శాతంగా ఉంది. శుక్రవారం రోజున‌ సర్వీసులను 1,316లకు కుదించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 169 స‌ర్వీసులు నడిపితే..కోవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్న‌ గుంటూరు జిల్లాలో కేవలం 10 సర్వీసులే తిరిగాయి. మ‌రోవైపు ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏప్రిల్‌ నెల జీతం చెల్లించాలని సంస్థ ఎండీ ఎం.ప్రతాప్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ మేరకు 90 శాతం జీతం చెల్లించాలంటూ పేర్కొన్నారు.

ఇక కరోనావైర‌స్ వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉంది. ఇంత‌వ‌ర‌కు ఈ వ్యాధికి వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ రాక‌పోవ‌డంతో..ప్ర‌జ‌లు ఎవ‌రికివారు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించాలని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నాయి. అందుకే ఉభ‌య తెలుగు రాష్ట్రాలు ప్ర‌జా ర‌వాణా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఆర్టీసీ బ‌స్సులు ఎక్కేముందు ప్ర‌యాణీకుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారులు. శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచుతున్నారు. కాగా ఇరు రాష్ట్రాల స‌మ్మ‌తితో అంతరాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు న‌డుపుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. కానీ తెలుగు ‌రాష్ట్రాలు మాత్రం ఆయా రాష్ట్రాల ప‌రిధిలోనే ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నాయి.

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?