AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాబోయే అమ్మకు అండగా ఏపీ సర్కార్

గర్భిణుల్లో వస్తున్న మధుమేహం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

కాబోయే అమ్మకు అండగా ఏపీ సర్కార్
Sanjay Kasula
|

Updated on: Sep 23, 2020 | 5:44 PM

Share

గర్భిణుల్లో వస్తున్న మధుమేహం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

దీనివల్ల లక్షలాది మహిళలు తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని రిపోర్టులో పేర్కొంది. చివరకు టైప్‌–2 గా రూపుదాలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు మధుమేహ నిర్ధారణ పరీక్షలు జరిపేలా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళ గర్భం దాల్చినట్టు నిర్ధారణ కాగానే మధుమేహ పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు లేదని తేలితే 24 నుంచి 28 వారాల గర్భిణికి మరోసారి పరీక్ష చేస్తారు. ఒకవేళ డయాబెటిస్‌ ఉన్నట్టు తేలితే నిపుణులైన వైద్యులతో వెంటనే చికిత్స అందజేస్తారు.  అలాంటి వారిని ప్రతినెలా పర్యవేక్షణ చేసి.. దీనిని టైప్‌–2 డయాబెటిస్‌గా మారకుండా నియంత్రిస్తారు. ఇలా కాబోయే అమ్మకు ఆరోగ్యాన్ని అందించే పనిలో పడింది ఏపీ సర్కార్.

Follow Us
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..