చంద్రబాబు గౌరవంగా ఖాళీ చేస్తే మంచిది: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత విషయంలో అధికార ,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి అనిల్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని ఆయన గౌరవంగా ఖాళీ చేసి వెళ్లిపోతే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజావేదికను అక్రమంగా నిర్మించారని, దీన్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆరోపించారు మంత్రి. కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గేది […]

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత విషయంలో అధికార ,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి అనిల్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని ఆయన గౌరవంగా ఖాళీ చేసి వెళ్లిపోతే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజావేదికను అక్రమంగా నిర్మించారని, దీన్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆరోపించారు మంత్రి. కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ఆయన రేపటినుంచి ఇవి ప్రారంభమవుతాయని చెప్పారు.
అక్రమ కట్టడాల కూల్చివేతను తుగ్లక్ చర్యగా అభివర్ణించిన మాజీ మంత్రి యనమలకు కూడా కౌంటరిచ్చారు అనిల్. గత ఐదేళ్లలో తుగ్లక్ పాలన చేశారు గనుకనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో యనమల బంధువులు ఎంత దోచుకున్నారో నిగ్గు తేల్చుతామన్నారు మంత్రి అనిల్.



