ముందు లోటస్‌పాండ్ కూల్చేయండి: బుద్ధా వెంకన్న
ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య అగ్గిని రాజేస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ప్రజావేదికను కూల్చివేసేముందు హైదరాబాద్‌లో లోటస్ పాండ్ భవనాన్ని కూడా కూల్చివేయాలన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్‌కు బుద్దా వెంకన్న […]
ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య అగ్గిని రాజేస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ప్రజావేదికను కూల్చివేసేముందు హైదరాబాద్‌లో లోటస్ పాండ్ భవనాన్ని కూడా కూల్చివేయాలన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్‌కు బుద్దా వెంకన్న రీట్వీట్ చేశారు.
ప్రజావేదిక అక్రమకట్టడమైతే చెరువును కబ్జాచేసి కట్టిన లోటస్ పాండ్ సక్రమ నిర్మాణమా అని పశ్నించారు. కిన్లే వాటర్ బాటిల్‌తో రూ.40 రూపాయలు మిగిల్చిన మీ సీఎం గారు.. రూ.8 కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చమంటున్నారని బుద్ధా కౌంటర్ ఇచ్చారు. ప్రజా వేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. అక్రమాస్తులతో కట్టిన లోటస్‌పాండ్‌ని ముందు కూల్చండి అప్పుడు మీరు చెబుతున్న నీతి నిజాయితీ, నిబద్ధత నిలబడతాయని ఆయన తన ట్వీట్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రజావేదిక కూల్చివేత ఇరుపార్టీల్లోనూ కాక రేపుతోంది.
అక్రమాస్తులతో కట్టిన లోటస్ పాండ్ ముందు కూల్చెయ్! అప్పుడే మీరు చెప్పే నీతి నిజాయితీ నిబద్ధత నిలబడుతుంది.
— venkanna_budda (@BuddaVenkanna) June 25, 2019
ప్రజావేదిక చంద్రబాబుగారికి ఇవ్వడం ఇష్టంలేకపోతే, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉపయోగించాలే కానీ, ఇలా కూల్చేస్తారా? కట్టేవారికి తెలుస్తుంది నిర్మాణాల విలువ..విధ్వంసకులకు తెలిసేది కూల్చడమే!
— venkanna_budda (@BuddaVenkanna) June 25, 2019
కిన్లే వాటర్ బాటిల్లో 40 రూపాయలు మిగిలించిన మీ సీఎం గారు, రూ.8 కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక కూల్చేయమంటున్నారు. చీనీ తోటలు తగలబెట్టే ఫ్యాక్షన్ బుద్ధి ఎక్కడికి పోతుంది.
— venkanna_budda (@BuddaVenkanna) June 25, 2019