కేసీఆర్ వార్నింగ్‌కు బెదరని జగన్.. ఆర్టీసీ విలీనంలో ముందడుగు!
ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయడంలో జగన్ మరో ముందడుగు వేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్ధిక, రవాణా, జీఏడీ, న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను వర్కింగ్ గ్రూప్‌లో జీవో జారీ చేసింది జగన్ సర్కార్. గతంలోనే ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంజనేయరెడ్డి కమిటీ ఆర్టీసీ విలీనాన్ని చేయొచ్చని నివేదిక ఇచ్చింది కూడా. ఇకపోతే జగన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ […]
ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయడంలో జగన్ మరో ముందడుగు వేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్ధిక, రవాణా, జీఏడీ, న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను వర్కింగ్ గ్రూప్‌లో జీవో జారీ చేసింది జగన్ సర్కార్. గతంలోనే ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంజనేయరెడ్డి కమిటీ ఆర్టీసీ విలీనాన్ని చేయొచ్చని నివేదిక ఇచ్చింది కూడా.
ఇకపోతే జగన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ తన నివేదికను వచ్చే నెల 15లోగా సమర్పించనున్నారు. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు, డిజిగ్నేషన్లు,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయడం వంటివి ఈ గ్రూప్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక వారు ఇచ్చిన నివేదికను బట్టి ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కాగా, ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేస్తామని జగన్ ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియ జరుగుతోంది.