పవన్‌కు షాక్.. జనసేనకు మరో కీలక నేత టాటా!
రాజకీయాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయనకు అనుకోని విధంగా షాకులు ఒక్కొక్కటిగా తగులుతూ వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు టాటా చెప్పేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధరణికోట వెంకటరమణ.. గురువారం ఆ పార్టీకి […]
రాజకీయాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయనకు అనుకోని విధంగా షాకులు ఒక్కొక్కటిగా తగులుతూ వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు టాటా చెప్పేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధరణికోట వెంకటరమణ.. గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత జనసేనకు కీలకంగా మారిన ధరణికోట ఇటీవల జగ్గయ్యపేటలో బీజేపీ నిర్వహించిన బాపూజీ సంకల్పయాత్రకు మద్దుతు ఇవ్వగా… అదే తరుణంలో సుజనాచౌదరితో కూడా భేటీ అయ్యారు.
బీజేపీ పెద్దల నుంచి అనుమతి రావడంతో.. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ధరణికోట మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ విధివిధానాలు అమోఘమని.. ఏపీలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. అందుకే జనసేనకు రాజీనామా చేశానని చెప్పారు’.