కరోనా సమయంలో ఏపీ సర్కార్ గొప్ప నిర్ణయం..మహిళల రక్షణ కోసం…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మహిళలు, చిన్నపిల్లలపై దాడులు పెరిగాయన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఏపీ సర్కార్ అండగా నిలిచింది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను మంగళవారం స్టార్ట్ చేసింది. 13 జిల్లాలోని ఈ సెంటర్లు 24 గంటలు వర్క్ చేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు వైద్య, ఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి […]

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మహిళలు, చిన్నపిల్లలపై దాడులు పెరిగాయన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఏపీ సర్కార్ అండగా నిలిచింది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను మంగళవారం స్టార్ట్ చేసింది. 13 జిల్లాలోని ఈ సెంటర్లు 24 గంటలు వర్క్ చేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు వైద్య, ఆరోగ్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు పోలీస్ సంరక్షణ, వసతి సౌకర్యం కల్పించింది. మరోవైపు బాధిత మహిళలకు ఎల్లవేళలా ఉమెన్ హెల్స్ లైన్ 181 అందుబాటులో ఉంటుంది.
జిల్లాల్లో ఎమర్జెన్సీ హెల్ప్ కోసం మహిళలు కాల్ చేయాల్సిన నెంబర్లు
జిల్లా పేరు ఫోన్ నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 తూర్పుగోదావరి 9603231497 గంటూరు 9963190234 ]నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 చిత్తూరు 9959776697 కడప 8897723899 విజయనగరం 8501914624 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797




