ఏపీ రాజధాని అమరావతే.. జగన్ సర్కార్ క్లారిటీ!
ఏపీ రాజధానిని అమరావతి నుంచి వేరే చోటుకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలకు జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు శ్రీమతి పమిడి శమంతకమణి, గునపాటి దీపక్ కుమార్, పర్చూరి అశోక్ బాబు.. రాజధాని తరలింపు అంశంపై మండలిలో పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రశ్నలు వేయగా.. అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదంటూ ఆయన లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. […]
ఏపీ రాజధానిని అమరావతి నుంచి వేరే చోటుకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలకు జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు శ్రీమతి పమిడి శమంతకమణి, గునపాటి దీపక్ కుమార్, పర్చూరి అశోక్ బాబు.. రాజధాని తరలింపు అంశంపై మండలిలో పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రశ్నలు వేయగా.. అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదంటూ ఆయన లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే జగన్ సర్కార్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదని.. నిపుణుల కమీటీ రాష్ట్రమంతా పర్యటించి.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో అన్న దానిపై సమగ్రమైన నివేదిక ఇస్తుందన్న చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సర్వే కూడా పూర్తయింది. ఇక కొద్దిరోజుల్లో వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తుందన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో లిఖితపూర్వకంగా రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది.