దీక్ష ఎఫెక్ట్.. టి.బిజెపి చీఫ్‌గా కన్‌ఫర్మ్ !

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె.అరుణ తన లక్ష్యానికి మరింత చేరువయ్యారా? తాజాగా మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగడం.. దానికి యావత్ తెలంగాణ యూనిట్ అండగా నిల్వడం చూస్తుంటే నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా రాని స్పందన డి.కె.అరుణ దీక్షకు రావడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. డి.కె.అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పేరున్న […]

దీక్ష ఎఫెక్ట్.. టి.బిజెపి చీఫ్‌గా కన్‌ఫర్మ్ !
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 4:42 PM

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె.అరుణ తన లక్ష్యానికి మరింత చేరువయ్యారా? తాజాగా మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగడం.. దానికి యావత్ తెలంగాణ యూనిట్ అండగా నిల్వడం చూస్తుంటే నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా రాని స్పందన డి.కె.అరుణ దీక్షకు రావడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

డి.కె.అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పేరున్న నేత. పాలమూరు పాలిటిక్స్‌కు మూలస్థంభంగా భావించే డి.కె. ఇంటి కోడలిగా రాజకీయాల్లోకి వచ్చిన అరుణ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిణామాలు.. మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలు లేకపోవడంతో అరుణ కమలం పార్టీలో చేరిపోయారు.

గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అరుణ గట్టి పోటీనే ఇచ్చారు. కానీ త్రిముఖ పోరులో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానం కోసం ఢిల్లీ పెద్దల్ని మెప్పించేందుకు అరుణ ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో ఆమె పేరు ఖరారైందన్న ప్రచారమూ జరిగింది. ఈనేపథ్యంలో అరుణ.. మద్యనిషేధం డిమాండ్‌ రెండ్రోజుల దీక్షకు పూనుకున్నారు. అయితే ఈ దీక్షకు పార్టీలోని సీనియర్ల నుంచి ఎలాంటి మద్దతు వస్తుందో అన్న సందేహాలు వినిపించాయి.

సందేహాలను పటాపంచలు చేస్తూ.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సహా పలువురు పార్టీ సీనియర్లు దీక్షలో అరుణకు సంఘీభావం ప్రకటించారు. మహిళా నేతలు పెద్ద ఎత్తున దీక్షలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో పార్టీలో మెజారిటీ వర్గాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చారన్న ఘనత అరుణకు దక్కిందని పరిశీలకులంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానానికి అరుణ మరింత దగ్గరయ్యరని చెప్పుకుంటున్నారు. కానీ, పార్టీలో చిరకాలం నుంచి పనిచేస్తున్న వారిని కాదని ఈ మధ్యకాలంలో చేరిన అరుణకు అధ్యక్ష పీఠం కట్టబెడతారా అన్న సందేహాన్ని ఇంకా కొందరు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి టి.బిజెపికి కొత్త అధ్యక్షుని ఎంపిక పూర్తి చేయాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్న తరుణంలో అరుణకు అవకాశం ఏ మేరకు వుందనే విషయం తేలాల్సి వుంది.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో