ఏపీలో భారీగా 11 వేల రేషన్ కార్డులు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా రేషన్ కార్డులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అర్హుల ముసుగులో రేషన్ కార్డులు పొందుతున్న అనర్హులపై వేటు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. వేతనాలు పొందుతూ.. వైట్ రేషన్ కార్డులు పొందుతున్న వారి కార్డులను రద్దు చేసింది. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా 1.39 లక్షల తెల్ల రేషన్ కార్డులను ఇనాక్టీవ్ చేసింది. అంతేకాకుండా.. వ్యాపారులు, కాంట్రాక్టులకు.. రేషన్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో దొడ్డిదారిన రేషన్ సరుకులు తరలించేవారు. వీటికి […]

ఏపీలో భారీగా 11 వేల రేషన్ కార్డులు రద్దు
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా రేషన్ కార్డులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అర్హుల ముసుగులో రేషన్ కార్డులు పొందుతున్న అనర్హులపై వేటు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. వేతనాలు పొందుతూ.. వైట్ రేషన్ కార్డులు పొందుతున్న వారి కార్డులను రద్దు చేసింది. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా 1.39 లక్షల తెల్ల రేషన్ కార్డులను ఇనాక్టీవ్ చేసింది. అంతేకాకుండా.. వ్యాపారులు, కాంట్రాక్టులకు.. రేషన్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో దొడ్డిదారిన రేషన్ సరుకులు తరలించేవారు. వీటికి ఇప్పుడు చెక్‌పడిందనే చెప్పవచ్చు. వాటి ద్వారా వచ్చే నూనె, బియ్యం, గోధుమ పిండి, చక్కెర తదితర వస్తువులను అక్రమరవాణా చేస్తున్న వైనం బయటపడింది. ఇప్పటికే బెల్ట్ షాపులపై కొరడా ఝుళిపించిన జగన్ ప్రభుత్వం.. అక్రమంగా రేషన్ కార్డులపై ప్రయోజనాలు పొందుతున్న వారిపై కూడా దృష్టి పెట్టింది.

గత ప్రభుత్వం బయోమెట్రిక్ ద్వారా రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టింది. కార్డులో వున్న కుటుంబంలోని ఓ సభ్యుడు ఎవరో ఒకరు వచ్చి బయోమెట్రిక్ మిషన్‌‌పై వేలిముద్ర వేస్తే సరుకులు అందేవి. ఈ విధానంలో కొంతమేర అక్రమాలకు చెక్ పడినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. జగన్ సర్కార్ తాజాగా ఈ విధానాన్ని సంస్కరించేందుకు పూనుకోంది.