అన్యమత ప్రచారం చేసేది ఎవరో తేలుస్తాం: వెల్లంపల్లి

తిరుమలలో అన్యమత ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. గత ప్రభుత్వ సానుభూతి పరులే ఇలా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోందని ఆయన ఆరోపించారు. కులాలు, మతాల మధ్యన చిచ్చు పెట్టాలని, వైసీపీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. టికెట్స్‌పై అన్యమత ప్రచారం చేయటంపై విచారణకు ఆదేశించామని.. రవాణాశాఖ మంత్రితో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం పట్ల బీజేపీ […]

అన్యమత ప్రచారం చేసేది ఎవరో తేలుస్తాం: వెల్లంపల్లి
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 1:13 PM

తిరుమలలో అన్యమత ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. గత ప్రభుత్వ సానుభూతి పరులే ఇలా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోందని ఆయన ఆరోపించారు. కులాలు, మతాల మధ్యన చిచ్చు పెట్టాలని, వైసీపీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. టికెట్స్‌పై అన్యమత ప్రచారం చేయటంపై విచారణకు ఆదేశించామని.. రవాణాశాఖ మంత్రితో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యథేశ్చగా అన్యమత ప్రచారం చేస్తున్నా ఆర్టీసీ అధికారులు నిద్రపోతున్నారా? టీటీడీ కళ్లు మూసుకుందా అంటూ బీజేపీ నేత భానుప్రకాశ్‌ మండిపడ్డారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడితే భక్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.