పాక్‌కు మరో షాక్.. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం అనవసరమన్న ఫ్రాన్స్

పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యాలు స్పందించాలన్న పాక్ తీరుపై ఇప్పటికే చైనా మినహా.. అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్ కూడా పాకిస్థాన్‌కు మొండిచెయ్యి చూపింది. కశ్మీరు అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ వ్యవహారంలో మూడో పక్షం జోక్యం చేసుకోకూడదని, కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆ దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌తో […]

పాక్‌కు మరో షాక్.. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం అనవసరమన్న ఫ్రాన్స్
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 1:00 PM

పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యాలు స్పందించాలన్న పాక్ తీరుపై ఇప్పటికే చైనా మినహా.. అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్ కూడా పాకిస్థాన్‌కు మొండిచెయ్యి చూపింది. కశ్మీరు అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ వ్యవహారంలో మూడో పక్షం జోక్యం చేసుకోకూడదని, కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆ దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీ దాదాపు గంటన్నర పాటు చర్చించుకున్నారు. కశ్మీర్ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతంలో ఎవరూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదని తేల్చి చెప్పారు.

ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలతో పాటు మరిన్ని కీలక అంశాలను చర్చించుకున్నట్లు ఫ్రాన్స్ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ విభజన, 370 రద్దుపై తమకు ప్రధాని మోదీ వివరించారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇరుదేశాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, మూడోపక్షం జోక్యం లేకుండా చూసుకోవాలని తాను మోదీకి సూచించినట్లు ఇమ్మాన్యుయేల్ ప్రకటించారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడి నుంచి షాకింగ్ ప్రకటన రావడంతో పాక్‌ బిత్తెరపోయింది.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకోగానే పాక్.. భద్రతామండలిలో తమ తరపున వాదించమని చైనాకు పురమాయించింది. అయితే అక్కడ పాక్‌కు భంగుపాటు తప్పలేదు. దీంతో ఈ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకోవాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఇదే సమయంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన రావడంతో పాక్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.