AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కట్టడిలో ఏపీ పోలీసులు భేష్ : గౌతం సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమన్నారు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు కూడా కరోనా సోకుతుందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 470 మంది పోలీసులు ఈ వ్యాధికి గురైనట్లు గౌతమ్ సావాంగ్ తెలిపారు.

కరోనా కట్టడిలో ఏపీ పోలీసులు భేష్ : గౌతం సవాంగ్
Balaraju Goud
|

Updated on: Jul 05, 2020 | 9:49 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమన్నారు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు కూడా కరోనా సోకుతుందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 470 మంది పోలీసులు ఈ వ్యాధికి గురైనట్లు గౌతమ్ సావాంగ్ తెలిపారు. ఆదివారం ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాక్‌డౌన్ సమయంలో బాగా పనిచేసిన పోలీసుల సేవలను ప్రశంసించారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్న ఆయన, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నాయని చెప్పారు. 55 ఏండ్ల వయసు పైబడినవారితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న పోలీసులకు ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలు కేటాయించడం లేదన్నారు.

రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న పోలీసులు సంఖ్య పెరుగుతున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు చెప్పారు. బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులు తిరిగి ఇళ్లకు చేరేవరకు కరోనా జాగత్తలు తప్పనిసరిగా పాటించాలని, సరైన ఆహారం తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగామన్న ఆయన.. కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగామన్నారు. కరోనా వైరస్ పట్ల మరింత అవగాహన పెరగాలన్న డీజీపీ.. అందరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన డీజీపీ సిటీ, రూరల్ , గ్రేహౌండ్స్, ఎస్ ఐ బీ అధికారులతో చర్చించారు. అటు మావోయిస్టుల వ్యవహారాలపైనా సమీక్షించినట్లు సమాచారం. విశాఖలో ప్రాపర్టీ క్రైం 41 శాతం తగ్గిందని, మిగిలిన నేరాలూ తగ్గుముఖం పట్టాయన్నారు. ఏడాదికి 320 వరకు మరణాలు రోడ్డుప్రమాదాలతో విశాఖలో జరుగుతున్నాయి.. కానీ ఈ ఏడాది 72 మరణాలు జరిగాయన్నారు. ప్రజల్లో హెల్మెట్ వాడకం పట్ల అవగాహన పెరిగిందన్నారు.