కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..

కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..

రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 85 శాతం నుంచి 90 శాతం వరకు క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

Ravi Kiran

|

Aug 07, 2020 | 4:15 PM

Coronavirus Crisis In AP: రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 85 శాతం నుంచి 90 శాతం వరకు క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ రేట్ 8.87 శాతం ఉంటే.. రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 8.56శాతం ఉందని ఆయన అన్నారు. అలాగే మరణాల రేటు దేశంలో 2.07 శాతం ఉండగా.. రాష్ట్రం 0.89 శాతం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రతీ పది లక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు చేస్తున్నామని.. అలాగే శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రం సగటు కన్నా ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాజాగా కరోనా నివారణా చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు సూచనలు ఇచ్చారు.

రాష్ట్రం ఉన్న 139 ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని సీఎం జగన్ అధికారులకు వెల్లడించారు. 104, 14410 కాల్‌ సెంటర్ నెంబర్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలని.. టెలి మెడిసిన్ ద్వారా మందులు పొందినవారికి మళ్లీ ఫోన్ చేసి సేవలపై ఆరా తీయాలని సూచించారు. ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిద్దికుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం తెలిపారు. అంతేకాకుండా అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లోని సేవలపైనా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం.. ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచాలని వివరించారు.

కాగా, కోవిడ్ వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై  ఏఎన్‌ఎం తగిన విధంగా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలన్నారు. దీంట్లో వాలంటీర్ల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గరా పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లతో కోవిడ్ సోకితే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం కూడా ఉండాలని.. ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం జగన్ తెలిపారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu