బాలీవుడ్ నటుడు సుశాంత్ డైరీలో పేజీలు మిస్!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు పలు కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు అదృశ్యం అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. సాధారణంగా రోజూ జరిగే విషయాలను..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు పలు కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు అదృశ్యం అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. సాధారణంగా రోజూ జరిగే విషయాలను సుశాంత్ డైరీలో రాస్తూంటాడని.. సన్నిహితులు చెబుతున్నారు. అయితే మిస్ అయిన ఆ డైరీ పేజీల్లో సుశాంత్ ఏం రాసి ఉంటాడన్న విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలా కూడా డైరీలో పేజీలు మిస్ అయిన విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కాగా సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి నటి రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. రియాతో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరింద, రియా చక్రవర్తి మాజీ మేనేజర్ శ్రుతీ మోదీలతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ కేసులో నటి రియా సహా పలువురిపై బీహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారు తమ విచారణను ప్రారంభించారు. అలాగే తన కుమారుడి అకౌంట్ల నుంచి దాదాపు 15కోట్లు మిస్ అయ్యాయని కేకే సింగ్ ఫిర్యాదు ఇవ్వడంతో ఈడీ రంగంలోకి దిగింది. సుశాంత్‌కి చెందిన కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి.. రియా అకౌంట్‌కి 15 కోట్లు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు.
Read More:
మరో ప్రముఖ నటి సూసైడ్, కలకలం రేపుతోన్న ఆత్మహత్యలు!
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి
కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్ట్, వ్యక్తి అరెస్ట్