ఈఎస్ఐ స్కామ్ : సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్ సస్పెండ్

ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టైన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.

ఈఎస్ఐ స్కామ్ : సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్ సస్పెండ్

ESI Scam in AP: ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టైన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. గత నెల 10 తేదీన సచివాలయంలో మురళీ మోహన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గ‌త టీడీపీ హ‌యాంలో కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన పితాని స‌త్య‌నారాయ‌ణ‌ వ‌ద్ద‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు ముర‌ళీ మోహ‌న్. ఆ స‌మ‌యంలో జ‌రిగిన‌ ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగాలు న‌మోదు చేసింది. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తున్నాడు మురళీ మోహన్.

ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇటీవ‌ల కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న రమేశ్ కుమార్, పితాని మాజీ పీఎస్ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను ఉన్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది.

 

Read More : అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ : జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

Click on your DTH Provider to Add TV9 Telugu