అజిత్ సినిమా రీమేక్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే.?

అజిత్ సినిమా రీమేక్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా చివరిదశకు చేరుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి పెద్ద బ్రేక్ పడింది.

Ravi Kiran

|

Aug 07, 2020 | 2:40 PM

Chiranjeevi In Vedalam Telugu Remake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా చివరిదశకు చేరుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి పెద్ద బ్రేక్ పడింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు కథలు వింటున్న చిరంజీవి.. త్వరలోనే ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నారని టాక్ నడుస్తోంది.

దర్శకుడు మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘వేదలమ్’ చిత్రాన్ని మెహర్ రమేష్ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు ఈ మూవీని నిర్మించనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu