ఈడీ ముందుకు రియా.. సంచలన పోస్ట్‌ చేసిన సుశాంత్‌ సోదరి

ఈడీ ముందుకు రియా.. సంచలన పోస్ట్‌ చేసిన సుశాంత్‌ సోదరి

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే సుశాంత్‌ లవర్‌ రియా చక్రవర్తికి అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇవాళ రియా ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 2:44 PM

Sushant Singh Rajput death case: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే సుశాంత్‌ లవర్‌ రియా చక్రవర్తికి అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇవాళ రియా ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లింది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. కాగా ఈడీ ముందుకు రియా వెళ్లిన క్రమంలో సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ కిర్తి సంచలన పోస్ట్ చేశారు.

”కొందరు చెప్పారు.. మీరు ఎవరి జోలికైనా వెళ్లేముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో వారిని ఎవరు రక్షిస్తున్నారో మీకు తెలీదు” అని ఉన్న ఓ శివుడి ఫొటోను శ్వేతా పోస్ట్ చేశారు. దానికి ‘హర హర మహాదేవ’ అనే కామెంట్‌ని పెట్టారు. ఆ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది నిజం’, ‘అతడి బిడ్డకు దేవుడు కచ్చితంగా న్యాయం చేస్తాడు’ అని కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్‌ కేసును విచారణకు తీసుకున్న సీబీఐ, రియా సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: 30 రోజులకు 32లక్షల బిల్లు వేసిన ఆసుపత్రి

https://www.instagram.com/p/CDk_kP9FmRe/?utm_source=ig_embed

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu