Breaking News
  • అమరావతి: ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020’ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై వివరించిన అధికారులు. సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలి. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయండి. 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయండి టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి. ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వండి మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయండి.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ట్రాయ్ కొత్త ఛైర్మన్‌గా పీడీ వాఘేలా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.
  • చెన్నై: ఎస్పీ బాలు హాస్పిటల బిల్లుల వివాదంపై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, ఎస్పీ చరణ్ సంయుక్త ప్రెస్ మీట్. మా ఆసుపత్రి మీద రూమర్లు సృష్టించవద్దు. బిల్లుల విషయంలో ఎలాంటి వివాదం లేదు. మేము ప్రతివారం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాము. చివర్లో బిల్లు కట్టవలసిన అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కానీ మూడు కోట్ల బిల్లు అయిందని ఇంకా కోటిన్నర పెండింగ్ ఉందని అందుకనే నాన్నగారి భౌతిక కాయాన్ని అప్పగించలేదని కట్టు కథలు అల్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుమార్తె దీపా వెంకట్ బిల్లు చెల్లించారంటూ ప్రచారం చేశారు. మేము నాన్నని కోల్పోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇంకా బాధ పెడుతున్నారు. తామరై పక్యం లో నాన్నగారి స్మృతి వనం నిర్మిస్తాము. నాన్నగారి కి భారత రత్న వస్తే సంతోషమే.. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఎప్పుడూ ఆయన భారతరత్నే. ఆయన ఏ ప్రోగ్రామ్ కి హాజరైనప్పుడు కరోనా సోకిందనేది ఇప్పుడు అప్రస్తుతం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది..మేము నాన్నగారిని కోల్పోయాము. ఇప్పటికైనా నాన్నగారి మీద దుష్ప్రచారాలు ఆపండి.

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ : జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

వాహ‌నాలు అక్రమ రిజిస్ట్రేష‌న్ కేసులో న్యాయం గెలుస్తుందన్నారు మాజీ శాస‌న‌స‌భ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇంజిన్, చాయిస్ నెంబర్లు ద్వారా వాహనం మొత్తం వివరాలు తెలుస్తాయ‌ని పేర్కొన్నారు.

Jc Prabhakar Reddy Comments On Jagan And NTR, అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ : జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

Jc Prabhakar Reddy Comments On Jagan : వాహ‌నాలు అక్రమ రిజిస్ట్రేష‌న్ కేసులో న్యాయం గెలుస్తుందన్నారు మాజీ శాస‌న‌స‌భ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇంజిన్, చాయిస్ నెంబర్లు ద్వారా వాహనం మొత్తం వివరాలు తెలుస్తాయ‌ని పేర్కొన్నారు. తమను ఏజెంట్లు మోసం చేశారని.. పోలీసులపై తాను విమర్శలు చేయనని చెప్పారు. నాగాలాండ్‌లో రూల్స్ వేరేగా ఉన్నాయని..అందుకే ఈ గంద‌ర‌గోళం మొదలైంద‌ని వివ‌రించారు. తన బస్సులన్నీ ఆగిపోయాయ‌ని.. బస్సులు తిప్పే పరిస్థితి లేదన్నారు. ఆర్టీసీ పరిస్థితి అంతే దారుణంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ త‌న‌ను అరెస్ట్ చేయించార‌న్నారు జేసీ. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా కేసులు పెట్టగలదని.. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైల్లో ఉన్నానని.. ఇప్పుడు 54 రోజులు జైల్లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అరెస్టుల‌కు పెద్దగా కారణాలు అవసరం లేదని..ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తే ఎవరైనా జైల్లో పెట్టగలరని పేర్కొన్నారు. అలాగే జైలు నుంచి రిలీజైన‌ తర్వాత జరిగిన ర్యాలీలో తాను పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన‌ట్లు వచ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాము రాష్ట్ర విభజన స‌మయంలో కాంగ్రెస్ ద్రోహం చేయడంతో టీడీపీలోకి వచ్చామని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్ఫ‌ష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన లేదని, ఎవరో ఏదో అనుకుంటే వాటన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌సరం లేద‌న్నారు.

 

Also Read : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మ‌న‌సు : గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి రోడ్డుపైనే ప్రాథ‌మిక‌ వైద్యం

Related Tags