రేపు ఇడుపులపాయకు సీఎం జగన్
మాజీ ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం సీఎం వైఎస్ జగన్ సోమవారం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్,ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం […]

మాజీ ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం సీఎం వైఎస్ జగన్ సోమవారం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్,ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.