పార్టీ మారాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరు.. మాజీ మంత్రి గంటా ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ బాంబు పేల్చారు. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలం నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయన పార్టీ మారడంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఏపీలో రావణ కాష్టంగా మారిన రాజధాని తరలింపు వ్యవహారంపై గంటా స్పందించారు. మంత్రి బొత్స పదేపదే రాజధాని మార్పుపై మాట్లాడటం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని, […]

పార్టీ మారాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరు.. మాజీ మంత్రి గంటా ఘాటు వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 9:02 PM

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ బాంబు పేల్చారు. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలం నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయన పార్టీ మారడంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఏపీలో రావణ కాష్టంగా మారిన రాజధాని తరలింపు వ్యవహారంపై గంటా స్పందించారు. మంత్రి బొత్స పదేపదే రాజధాని మార్పుపై మాట్లాడటం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని, ఇప్పటికైనా సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో అమరావతి రాజధానిగా ఉండటాన్ని స్వాగతిస్తున్నామని జగన్ చెప్పారని, ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండాలన్నారు. టీడీపీ ఓటమికి కారణం టికెట్ల కేటాయింపులో సమతుల్యత లోపమే కారణమన్నారు. మంత్రి అవంతి శ్రినివాస్‌ను మంత్రిగా గుర్తించనంటూ గంటా వ్యాఖ్యానించారు.

అయితే సాగరతీరం విశాఖను ఏపీ ఆర్ధిక రాజధానిగా చేయాలంటూ గంటా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయపై టీడీపీ కూడా ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గంటా పార్టీ మారతారా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాకున్నా.. రావాలనుకుంటే మాత్రం ఎవ్వరూ ఆపలేరన్నవ్యాఖ్యలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..