ప్రధానిమోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ ఉదయం హస్తినలో మోదీతో భేటీ అయిన సీఎం జగగన్.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, […]

ప్రధానిమోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 06, 2020 | 12:23 PM

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ ఉదయం హస్తినలో మోదీతో భేటీ అయిన సీఎం జగగన్.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా, సోమవారం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ప్రధానితో భేటీ అనంతరం ఈ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదలైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు.