రెండేళ్లలో బాబును జైలుకు పంపడం ఖాయం: సునీల్ దేవధర్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును రెండేళ్లలో జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు. మంగళవారం మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఆయన పామర్రులో పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడని.. ఆయనను ఉపేక్షించడం జరగదని పేర్కొన్నారు. తన రాజకీయ వారసుడిగా లోకేష్‌ను […]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును రెండేళ్లలో జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు. మంగళవారం మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఆయన పామర్రులో పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడని.. ఆయనను ఉపేక్షించడం జరగదని పేర్కొన్నారు. తన రాజకీయ వారసుడిగా లోకేష్‌ను ప్రకటించడం కూడా శోచనీయమని సునీల్ అభిప్రాయపడ్డారు. ఇక తాను గెలిస్తే కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని పేర్కొన్నారు.