Virushka: ‘తొలిసారి’ కెమెరా కంటికి చిక్కిన విరుష్క జంట.. క్లినిక్ నుంచి బయటకు వస్తుండగా..
Anushka First Appearance post delivery: ఇండియాలో టాప్ సెలబ్రిటీ కపుల్స్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట ఒకరు. ఒకరిది క్రీడా రంగం అయితే మరొకరిది సినిమా రంగం.. ప్రేమ అనే కామన్ పాయింట్ వీరిద్దరినీ ఒక్కటి చేసింది...
Anushka First Appearance post delivery: ఇండియాలో టాప్ సెలబ్రిటీ కపుల్స్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట ఒకరు. ఒకరిది క్రీడా రంగం అయితే మరొకరిది సినిమా రంగం.. ప్రేమ అనే కామన్ పాయింట్ వీరిద్దరినీ ఒక్కటి చేసింది. 2017 డిసెంబర్‌లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వారి రంగాల్లో బిజీగా గడిపే ఈ ఇద్దరు.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సరే రెక్కలు కట్టుకొని పర్యాటక ప్రదేశాల్లో వాలిపోతుంటారు. అన్యోన్యతకు మారుపేరుగా ఉంటూ వస్తోన్న ఈ జంట తాజాగా తల్లిద్రండులుగా ప్రమోషన్ కొట్టేసిన విషయం తెలిసిందే.
జనవరి 11న అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే ఇప్పటి వరకు తమ కూతురు ఫొటోను మాత్రం షేర్ చేయలేదీ జంట. బేబీ బంప్‌తో దిగిన చాలా ఫొటోలు అభిమానులతో పంచుకున్న అనుష్క… తన గారాల పట్టిని మాత్రం ఇంకా ప్రపంచానికి పరిచయం చేయలేదు. అంతేకాకుండా అనుష్క కూడా కెమెరాకు కనిపించలేదు. ఈ క్రమంలోనే తాజాగా విరుష్క జంట కెమెరా కంటికి చిక్కారు. ముంబైలో ఒక క్లినిక్‌కు వెళ్లి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాకు పోజిచ్చారు. నిజానికి క్లినిక్‌లో నుంచి రాగానే కారు ఎక్కే అవకాశం ఉన్నా మీడియా ప్రతినిథుల కోరిక మేరకు ఇద్దరు కలిసి ఫొటోకు పోజిచ్చి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరి విరుష్క జంట తమ చిన్నారిని ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.
ఫొటోగ్రాఫర్ భయానీ పోస్ట్ చేసిన వీడియో ఇదే..
View this post on Instagram
Also Read: Tollywood: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై టాలీవుడ్ ఫోకస్.. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలదాకా..