ఏపీసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. చివరి తేదీ…

ఏపీసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. చివరి తేదీ...

ఆంధ్రప్రదేశ్‌లో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ప‌్రొఫెస‌ర్లు, లెక్చ‌ర‌ర్ల అర్హ‌త కోసం నిర్వ‌హించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేష‌న్‌-2020ని ఆంధ్ర‌ యూనివ‌ర్సిటీ..

Sanjay Kasula

|

Aug 10, 2020 | 4:50 PM

Andhra University has Released The APSET Notification : ఆంధ్రప్రదేశ్‌లో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ప‌్రొఫెస‌ర్లు, లెక్చ‌ర‌ర్ల అర్హ‌త కోసం నిర్వ‌హించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేష‌న్‌-2020ని ఆంధ్ర‌ యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ధర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆగ‌స్టు 14న నుంచి ధర‌ఖాస్తులు తీసుకుంటామని, సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో  అప్లై చేసోవ‌చ్చ‌ని తెలిపింది. ధర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.in , apset.net.in లో అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది. పీజీలోని స‌ంబంధిత స‌బ్జెక్టులో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాల్సిటుంది. ఈ ఏడాది పీజీ చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు రాస్తున్న‌వారు రెండేండ్ల‌లో స‌ర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించాల్సిటుందని యునివర్సిటీ  ప్రకటనలో ఈ వివరాలను వెల్లడిచారు. ధర‌ఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబ‌ర్ 19 అని ప్రకటించింది. రాత‌ పరీక్షను డిసెంబ‌ర్ 6 ఉంటుందని పేర్కొంది.

ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అర్హత పరీక్షలుకు నోటిఫికేషన్లు సైతం వెలువడలేదు. డిసెంబర్ నాటికి కొవిడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu