వెబ్‌సిరీస్‌గా గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే లైఫ్ స్టోరీ

వెబ్‌సిరీస్‌గా గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే లైఫ్ స్టోరీ
Vikas Dubey

ప్ర‌స్తుతం అన్ని ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చరిత్ర‌లు ఆధారంగా సినిమాలు వ‌చ్చాయి.

Ram Naramaneni

|

Aug 10, 2020 | 4:50 PM

Vikas Dubey Web Series : ప్ర‌స్తుతం అన్ని ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చరిత్ర‌లు ఆధారంగా సినిమాలు వ‌చ్చాయి. కొంద‌రు క్రిమిన‌ల్స్ బ‌యోపిక్స్ కూడా హ‌ల్‌చ‌ల్ చేశాయి. దావూద్ ఇబ్ర‌హీం, న‌యూం వంటి..డాన్‌ల జీవితాల‌కు కూడా తెర‌కెక్కించారు ప‌లువురు మేక‌ర్స్. ఇప్పుడు మ‌రో గ్యాంగ్‌స్ట‌ర్ బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతుంది. అది ఎవ‌రిదో కాదు. ఇటీవ‌ల ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మై చ‌ర్చనియాంశ‌మైన వ్య‌క్తి వికాస్ దుబేది. గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎన్నో దారుణాలు చెయ్య‌డ‌మే కాదు..ఇటీవ‌లే 8 మంది పోలీసుల‌ను కూడా హ‌త‌మార్చాడు ఇత‌డు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల్లోనే అత‌డిని ఎన్‌కౌంట‌ర్ చేశారు పోలీసులు.

కాగా ఇత‌డి జీవిత క‌థ‌ను బాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌న్స‌త్ మెహతా తెర‌కెక్కించ‌బోతున్నారు. అయితే సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా రూపొందిచ‌నున్నారు. ప్రొడ్యూస‌ర్ శైలేశ్ ఆర్ సింగ్ ఇందుకు సంబంధించి అనుమ‌తులు కూడా తీసుకున్నార‌ట‌. ఈ కథ‌ను చాలా ఆసక్తిక‌రంగా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్.

Hansal Mehta to make web series on gangster Vikas Dubey, says sees ...

Also Read : రెండు సంవ‌త్స‌రాల చిన్నారికి కిడ్నీ ఫెయిల్యూర్ : ఆ ద‌గ్గు మందే కార‌ణ‌మ‌ట‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu