మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌కు కోవిడ్

మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌కు కోవిడ్

దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి ఎంత‌లా వ్యాప్తి చెందుతుంతో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది పలువురు రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖ‌ సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన నిత్యం ప‌డుతూనే ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ సంఖ్య..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 7:27 PM

దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి ఎంత‌లా వ్యాప్తి చెందుతుంతో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది పలువురు రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖ‌ సినీ, క్రీడా సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన నిత్యం ప‌డుతూనే ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ సంఖ్య ఎక్కువ‌వుతోంది. అలాగే మంచి చికిత్స తీసుకుని వెంట‌నే కోలుకుంటున్నారు కూడా. ఇప్పుడు తాజాగా మ‌రో బాలీవుడ్ హీరోయిన్ కూడా క‌రోనా వైర‌స్ సోకింద‌ట‌. మాజీ ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ న‌టి న‌టాషా సూరికి కోవిడ్ పాజిటివ్‌ నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

”ముఖ్యమైన ప‌ని ఉండి ఇటీవ‌లే పూణె వెళ్లి వ‌చ్చాను. ఆ త‌ర్వాత వ‌చ్చిన రెండు, మూడు రోజుల‌కే జ్వ‌రం, జ‌లుబు వ‌చ్చింది. అనుమానం వ‌చ్చి కోవిడ్ టెస్టు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ అని వ‌చ్చింది. వెంట‌నే నేను హోమ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయాను. ప్ర‌స్తుతం స్వ‌ల్పంగా జ్వ‌రం, నీర‌సంగా ఉందని” పోస్ట్‌లో పేర్కొంది న‌టాషా. కాగా ఈ ముద్దుగుమ్మ బిపాస బ‌సు, క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన డేంజ‌ర‌స్ చిత్రంలో న‌టించింది. ఆగ‌ష్టు 14న ఇది ఓటీటీ ద్వారా విడుద‌ల కాబోతుంది.

Read More: 

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ల్యాప్‌టాప్‌ల బిజినెస్‌కి తొషిబా కంపెనీ గుడ్‌ బై

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu